బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్:హైదరాబాద్‌లోని బాలా పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈరోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు.మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలతో పడివున్న వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…