విజయోత్సవ సభను తలపించేలా బండారు నామినేషన్.

విజయోత్సవ సభను తలపించేలా బండారు నామినేషన్.

TEJA NEWS

సాగరాన్ని తలపించిన జన సందోహం.
మనం చరిత్రలో పురాణాలలో ఇతిహాసలలో రామాదండు అంటే విన్నాం… కానీ దృశ్య మాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించటమే ఇప్పటి తరం వంతు అయింది. అయితే రామాదండు ఎలా ఉంటుందో తెలియదు కాని బుధవారం కొత్తపేట నియోజకవర్గంలో పసుపు దండును దృశ్య రూపంలో చూసాం. ప్రతి పక్షం పార్టీలో అసలు ఏమి లేదు అనేస్థాయి నుండి బండారు సోదరులు చేసిన కృషి వల్ల మార్పు కోరుకుంటున్న ప్రజానీకం గుండెల్లో నుండి ఏదైనా చేయగలం అనే దాకా ముందుకు సాగారు ఎన్డీఏ తమ్ముళ్లు. ఒక పక్క పార్టీపై అభిమానం, మరో ప్రక్క బండారు సోదరులు చేసే సేవా కార్యక్రమలు వెరసి మొత్తంగా నామినేషన్ కోసం నియోజకవర్గ రహదారులు పసుపు, తెలుపు, కాషాయమయంగా మారాయి. బండారు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్డిఓ జీవివి సత్యనారాయణకు ఉదయం గం 11.40 నిమిషాలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

మరో నామినేషన్ సెట్ ను సత్యానందరావు సతీమణి కమలారాణి ఆర్డీవోకు నామినేషన్ పత్రాలను అందజేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, ముదునూరి వెంకటరాజు, ముత్యాల బాబ్జి, పాలూరి సత్యానందం సమక్షంలో దాఖలు చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో గల ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల నుండి వేలాదిగా జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS