బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు చేసిన బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు,ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
మాదలలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను రాజుపాలెంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీలు చేసిన బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత రాజుపాలెం
విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి సవిత.విద్యార్థులతో కలసి భోజనం చేసిన మంత్రి సవిత,శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు.మొంథా తుఫాన్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి.. వార్డెన్లు 24 గంటలు హాస్టళ్లలో ఉండాల్సిందే. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలి. హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు తక్షణమే వైద్యం అందించాలని మంత్రి సవిత తెలిపారు.శాశ్వత భవన నిర్మాణాలకు కృషి చేస్తాం.రాజుపాలెం కేంద్రంగా బిసి బాలుర వసతి గృహం, మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహాలకు శాశ్వత భవన నిర్మాణాలకు కృషి చేస్తానని బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత చెప్పారు. మండలంలోని రాజుపాలెం గ్రామంలో శిధిలావస్థకు గురైన బీసీ బాలుర వసతి గృహాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి సవిత వసతి గృహంలోని గదులు లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వసతి గృహంలో ఎంతమంది పిల్లలు ఉన్నారని అధికారులను అడిగారు 120 మంది పిల్లలు ఉన్నారని సమాధానం చెప్పడంతో ఎక్కువ మందే ఉన్నారు, వారందరిని సురక్షిత భవనంలోకి తరలించాలని ఆదేశించారు. సురక్షిత భవనమును తీసుకొని పిల్లలందరినీ అందులోకి తరలించాలని చెప్పారు. సంబంధిత శాఖ అధికారి ఈ భవన మరమ్మత్తుల నిమిత్తం రూ 4 లక్షలు పైన నిధులు మంజూరయ్యా అని చెప్పగా ఈ వసతి గృహానికి రూపాయి ఖర్చుపెట్టిన వేస్ట్ అని అన్నారు వెంటనే భవనమును అద్దెకు తీసుకొని పిల్లలను అందులోకి మార్చాలని చెప్పారు నూతన భవన నిర్మాణానికి ఇక్కడ ఎంత స్థలం ఉందని వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ భవనం నిర్మాణం తో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమీపంలో కేటాయించిన స్థలంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహాన్ని కూడా నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.చదువుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. చదువుపైకూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. మండల కేంద్రమైన రాజుపాలెం గ్రామంలో శిథిలవస్థలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని మంత్రి సవిత,స్థానిక శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషికి ఆహారం తర్వాత చదువు ఎంతో అవసరమని చెప్పారు.శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కోరిన విధంగా బీసీ బాలుర వసతి గృహం మహాత్మ జ్యోతిబా పూలే బాలికల వసతి గృహ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.వసతి గృహాన్ని పరిశీలించడానికి రావడం అభినందనయం.ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం నెలకొన్న వాతావరణ దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిసి వసతి గృహాల్లో పరిస్థితి ఎలా ఉందో చూడమని మంత్రి సవిత కి చెప్పడం తోనే ఆమె స్వయంగా వచ్చి రాజుపాలెం లో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించటం అభినందనీయమన్నారు. బీసీ బాలుర వసతి గృహంతో పాటు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహ నిర్మించేందుకు హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజక వర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
