పునరావాస కేంద్రాలు పరిశీలన
** టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుతో కలిసి కమిషనర్ తనిఖీ
తిరుపతి: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడే ప్రజల సౌకర్యార్థం నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అండ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తో కలిసి జాయింట్ కలెక్టర్ (ఇంచార్జి), కమిషనర్ మౌర్య మంగళవారం పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్, వసతీ సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ అధికారులు సేతు మాదవ్, రవి, ఆర్.ఐ లు, తదితరులు ఉన్నారు.
హెల్ప్ లైన్ నంబర్లు.. 0877-2256766, 9000822909..
మొంథా తుఫాన్ పునరావాస కేంద్రాలు
- పార్వతి పురం, ప్రగతి నగర్ – పార్వతీపురం మునిసిపల్ స్కూల్.
- కె. బి.ఆర్.నగర్ – తుడా క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాల.
- నవోదయ కాలనీ – కొత్తపల్లి ప్రైమరీ స్కూల్.
- ఆటోనగర్, గొల్లవాణిగుంట, పూలవాణిగుంట, కోరమేనుగుంట – రాజీవగాంధీ స్కూల్, కోరమేనుగుంట స్కూల్, ఆర్.ఎస్.ఇంగ్లీష్ మీడియం స్కూల్, రేణిగుంట రోడ్డు సచివాలయం.
- స్కావేంజెర్స్ కాలనీ, అబ్బన్న కాలనీ – మునిసిపల్ స్కూల్, ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం స్కూల్, మధురనగర్ 33వ సచివాలయం.
- ఎర్రమిట్ట, సంజయ్ గాంధీ కాలనీ, శ్రీరామ్ నగర్ – మునిసిపల్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ సత్యనారాయణ పురం.
- తెల్లగుంట – డి-అడిక్షన్ సెంటర్.
- ఎర్రమిట్ట శివజ్యోతినగర్ – రత్నం స్కూల్, సత్యనారాయణపురం.
- సంజీవయ్య నగర్ – సింగాలగుంట మునిసిపల్ స్కూల్.
- ఉప్పంగి హరిజనవాడ, శ్రీనివాసపురం, రేణిగుంట రోడ్డు – ఉప్పంగి హరిజన
వాడ
11.మునిసిపల్ స్కూల్.
యశోదనగర్ – లిటిల్ ఏంజెల్స్ హై స్కూల్.
