కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస

కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస

TEJA NEWS

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇంజినీర్లు నివేదిక ఇచ్చాక కట్టేందుకు ఎల్‌అండ్‌టీ ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాఫర్‌ డ్యామ్‌ కట్టడం లేదని విమర్శించారు. ఇంత నీచమైన రాజకీయాలు లోక్‌సభ ఎన్నికల్లో లాభం కోసమేనా అని కేటీఆర్‌ ప్రశ్నించారు……..

Print Friendly, PDF & Email

TEJA NEWS