TEJA NEWS

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆమె ఎన్టీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మరణించిన విషయం తెలిసిందే. జిల్లా పర్యటనలో భాగంగా కంచికచర్లలోని చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రశేఖర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.


TEJA NEWS