BJP's candidate Gujjula Premender Reddy should win in the graduate by-election
పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి: సంకినేని వెంకటేశ్వర రావు
వరంగల్-ఖమ్మం – నల్గొండ
పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి తరపున పోటి చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని మేధావులు, విద్యావంతులు బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టభద్రుల బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ ఎస్ నుండి గెలిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎటువంటి కారణం లేకుండా రాజీనామా చేయడం వల్లనే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు.
బిఆర్ ఎస్ , కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే పలు పార్టీలు మారారని, వారితో ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. తాను నలబై ఏళ్ల నుండి బిజెపి లో ఎటువంటి పదవులు లేకున్నా ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. శాసనమండలి లో ప్రజల పక్షాన పోరాడతానని తెలిపారు. మోడి ప్రభుత్వం బిబినగర్ లో ఎయిమ్స్, వరంగల్ లో టెక్స్ టైల్స్ పార్క్, సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వ విద్యాలయం, ఏకలవ్య, మోడల్ స్కూల్ లు ఏర్పాటు చేసిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో జివో 317 కు వ్యతిరేకంగా తాను పోరాటం చేశానని అన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం లో స్కాలర్‌షిప్ లు , ఫీజు రెంబర్స్ మెంట్ నిధులు మంజూరు చేయలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని, మెగా డిఎస్పి ఊసే లేదని అన్నారు. ప్రైవేటు సెక్టర్ లో పనిచేసే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మైనారిటీ నాయకులు హబీద్, రంగినేని లక్ష్మణరావు, మల్లెబోయిన అంజి యాదవ్, అర్రూరి శివ తదితరులు పాల్గొన్నారు.