TEJA NEWS

[ పెండింగ్ బిల్లులను చెల్లించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన తపస్ సంఘం ఉపాధ్యాయులు


వనపర్తి :
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు పిఆర్సి మరియు పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గణపురం మండలం బలిజపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు

ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ 2022 జూలై నుండి 2024 వరకు ఐదు డిఏలను గతప్రభుత్వం మూడు డీఏలను ప్రస్తుత ప్రభుత్వం రెండు డియాలను ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు చెల్లించలేదని అదేవిధంగా పిఆర్సి కాలపరిమితైపోయి రెండు సంవత్సరాల పూర్తవుతున్న ఇంతవరకు చెల్లించలేదని అదేవిధంగా ఆర్థికపరమైన స్త్రీలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాల్లో జిహెచ్ఎంల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యు రాలు మంజులత పి ఆర్ టి యు నాయకులు యుటిఎఫ్ నాయకులు ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి సునీత నలిని చంద్రశేఖర్ సురేందర్ సి కవిత గోవిందు శేఖర్ కురుమయ్య రమేష్ చారి మల్లేష్ నిరంజన్ గౌడ్ బాలరాజు వసంత సత్యం నారాయణ ఎండి సాఫ్ట్వేర్ అనిల్ కుమార్ జయంతి అర్జున్ ఆలీ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS