TEJA NEWS

బిఆర్ఎస్ దిక్షా దివస్

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు రెడీ అయ్యాయి. తెలంగాణభవన్‌లో దీక్షా దివస్‌ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరిశీలించారు.

శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూద నాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, దీక్షాదివస్‌ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌తోపాటు..,

మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు ఆనంద్‌గౌడ్‌, గోవర్ధన్‌రెడ్డి సహా పార్టీ సీనియర్‌ నేతలు ఏర్పాట్ల పరిశీలన స మయంలో కేటీఆర్‌ వెంట ఉన్నారు.


TEJA NEWS