బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఆఫీసు సక్రమమేనని, తమ పార్టీ ఆఫీసు ఇటుక కదిల్చినా.. గాంధీభవన్ కూలుతుందంటూ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని, మొగోళ్లయితే గాంధీభవన్ ను టచ్ చేయాలని సవాల్ విసిరారు. ల్యాండ్ కబ్జాలు చేసినోళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీలు మీద ఉరికిస్తమని హెచ్చరించారు. దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు రెండు రోజులకు ఒకటి చొప్పున బయటపెడుతానని పేర్కొన్నారు. హన్మకొండ జిల్లాను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఇక నర్సంపేటలో పీకలేని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడి వచ్చి పీకుతాడా అంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. తాను వాళ్లలా గాలి మాటలు మాట్లాడడం లేదని, అన్ని అధారాలు ఉన్నాయని, వాళ్లకు ఆ స్థలాన్ని కేటాయించలేదని, ప్రెస్ క్లబ్ వెనకాల ఉన్న జాగా ఇస్తే వారు మార్పు కోసం లెటర్ పెట్టారు కానీ.. కేటాయించలేదన్నారు. ఇక కరెంటు మీటరు లేదని, ఇంటి నెంబర్ కూడా లేదని ఇవి నిజాలు కావో లేదో వాళ్లే చెప్పాలన్నారు. వాళ్లదగ్గర ప్రూఫ్ లు ఉంటే తీసుకురావాలని హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు
బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…