TEJA NEWS

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి వచ్చిన భూకబ్జాదారులను అడ్డుకున్న బిఆర్ఎస్ నాయకులు

మల్కాజిగిరి
29 ఆగస్టు

ప్రజలకు నీటిని అందించడానికి కేటాయించిన స్థలాన్ని కొందరు భూకబ్జాదారులు మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మహీంద్రా హిల్స్ లో సుమారు 3500 గజాల స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన భూకబ్జాదారులను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. మహేంద్ర హిల్స్ లో మల్కాజిగిరి మండలానికి చెందిన సర్వే నంబర్ 844/ 1 ప్రభుత్వ స్థలాన్ని మల్కాజిగిరి ప్రజలకు త్రాగునీరు అందించడానికి 3500 గజాల స్థలాన్ని ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయించారు.అట్టి స్థలాన్ని తమదంటు తప్పుడు పత్రాలను సృష్టించి కొంతమంది స్థలం దగ్గరికి వచ్చి జెసిబి ల సహాయంతో పనులు చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బిఆర్ఎస్ నాయకులులతో కలిసి రాము సంఘటన స్థలానికి చేరుకొని భూకబ్జాదాలను అడ్డుకున్నారు. గతంలో ఈ స్థలం ప్రభుత్వం మల్కాజ్గిరి ప్రజలకు నీటినందించడానికి ట్యాంక్ నిర్మాణం కోసం జలమండలికి కేటాయించిందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్థలం మల్కాజిగిరి ప్రజలకు నీటిని అందించడానికి ఉపయోగపడేదేనని తెలిపారు. భూకబ్జాదారులకు ఎవ్వరు వత్తాసు పలికిన సహించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS