నెల్లూరు హిజ్రా నేత దారుణ హత్య
నెల్లూరులో హిజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్య సంచలనం రేపింది. పార్లపల్లిలోని ఓ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా గత అర్ధరాత్రి హాసినిపై దాడి చేసి గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రెండు కార్లలో వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేసి పరార్ అయ్యారు.
ఈ కిరాతక ఘటనలో హిజ్రా నాయకురాలు హాసిని దుర్మరణం చెందింది. ఇక పోలీసులు రంగ ప్రవేశం చేశారు. హత్యాస్థలికి చేరుకున్నారు. క్యూస్ టీమ్ నిందితుల ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు. ఇక హిజ్రా నాయకురాలు హాసిని హత్య సమాచారంతో హిజ్రాలు పెద్ద సంఖ్యలో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. హిజ్రాల సంఘం నేత హాసినిని దారుణంగా హతమార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.