వాలంటీర్ సేవలను విమర్శిస్తే సహించను’.. బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ సేవలను విమర్శిస్తే సహించను’.. బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు

TEJA NEWS

శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఖండించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియా సమావేశంలో బుట్ట రేణుక మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లుపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాలంటీర్లు చేస్తున్న సేవలను అభినందించడం పోయి టెర్రరిస్టులతో పోల్చడం చాలా దారుణం అన్నారు.

రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడానికి సీఎం జగన్ సచివాలయాల ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లను ప్రతి ఒక్కరు అభినందించాలి తప్ప వారిని విమర్శించడం సరికాదన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో కమీషన్లు తీసుకుంటూ తిరిగి టిడిపి వారికే పథకాలు అందించారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి గడపకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందించామన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS