ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు : గూడూరి ఎరిక్షన్ బాబు

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు : గూడూరి ఎరిక్షన్ బాబు

TEJA NEWS

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు గారు : గూడూరి ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యర్రగొండపాలెం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ… ప్రకాశం జిల్లా నుండే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 5న కనిగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల శంఖారావం సభకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నుండి వేలాదిగా తరలి వెళ్లాలని గూడూరి ఎరిక్షన్ బాబు గారు టిడిపి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు వేములకొండ శ్రీనివాసరావు, కార్యక్రమ పరిశీలకులు జడ్డారావు మరియు ఐదు మండలాల టిడిపి అధ్యక్షులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS