TEJA NEWS

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఎవరు అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు.నా తరఫున నా కుమారుడు పాలపర్తి విజయరాజ్ రాజకీయంలోకి వచ్చారని ప్రజలందరూ నన్ను ఆదరించినట్లే నా కుమారుని కూడా ఆదరించాలని ఆయన అన్నారు. అనంతరం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈరోజు నుంచి 10 రోజులు దాకా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పలు రకాలుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు మెడబలిమి వెంకటేశ్వర్లు, అన్నదాసు ప్రవీణ్ కుమార్, దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS