TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి కాసాని శ్వేత సుధాకర్ , నిజాంపేట్ 19వ వార్డు కార్పొరేటర్ కాసాని సుధాకర్ , మాజీ ఎంపిపి వెంకటేష్ ముదిరాజ్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. HMT హిల్స్ లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రం అందించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ నేతృత్వంలో పేదల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులు దాటినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయి మద్దతు కాసాని జ్ఞానేశ్వర్ కి వుండాలని అని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇద్దాం అని ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు,శ్రేయభిలాషులు ,అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS