చేవెళ్ల రోడ్డు ప్రమాదం అత్యంత బాధకర దుర్ఘటన: రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతిభీమ్ భరత్
శంకర్‌పల్లి: చేవెళ్ల సోమవారం జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణ నష్టం తనను ఎంతో బాధించిందని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతిభీమ్ భరత్ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్దించారు. మరణించిన వారి కుటుంబానికి నుండి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని పేర్కొన్నారు.
