TEJA NEWS

కార్తీక మాసం కన్నుల పండగ “తులసీ – దామోదర” కళ్యాణ మహోత్సవం

భక్తుల సమక్షంలో

శ్రీ కామాక్షి సమేతశ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం లో ఆలయ పూజారి విశ్వనాథ సుబ్బరామయ్య సమక్షంలో చేజర్ల సీతారామరెడ్డి,విమలమ్మ దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా “తులసి – దామోదర” కళ్యాణ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా కన్నుల పండగ భక్తజన సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణతో, మంగళ వాయిద్యాలతో, స్వర్ణ పుష్పాలతో, అంగరంగ వైభవంగా జరిగింది. గండవరపు హర్షవర్ధన్ రెడ్డి, వైష్ణవి దంపతులు కళ్యాణ మహోత్సవంలో భక్తి పారవశంతో పాల్గొన్నారు. అనంతరం ప్రథమ పూజారి సుబరామయ్య తులసి- దామోదర గురించి భక్తులకి ప్రత్యేకంగా వివరించడం జరిగింది.ఈ కళ్యాణం తిలకించిన భక్తులు మా జన్మ ధన్యమైందని భక్త జనం తెలియజేశారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి తులసీ దామోదర మొక్కలతో తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది.