శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కార్తీక శోభ
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో కార్తీక సోమవారం శోభ నెలకొంది. ఆలయానికి తెల్లవారుజామునుండే భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు పదివేల మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయాల ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్దలతో కార్తీక దీప పూజలు నిర్వహించారు. స్వామివారికి ఐదు మంది అర్చకులు విశేష అభిషేక
పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులకు నలుగురు అన్నదాతలు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు గండేటి శ్రీరాములు గౌడ్ స్వరూప, గోపులారం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ నర్సింహారెడ్డి, వివంత డెవలపర్స్ నవ్య రమణయ్య వెంకటస్వామి, ఎన్కేపల్లి గ్రామానికి చెందిన మానస మాణిక్ రెడ్డి, అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాతలను స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాలను బహుకరించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి ఉన్నారు.
