విపిఆర్ నేత్ర పేదలకి ఒక గొప్ప వరం
- విపిఆర్ నేత్ర యాత్ర
- ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతమ్మ, కాకర్ల సురేష్ ప్రజా సేవలో మేరు పర్వతమైన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి గ్రామస్తులు, నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విపిఆర్ నేత్ర బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిచూపు సరిగా లేని పలువురికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కంటి అద్దాలు అందజేశారు. వందలాదిమంది వృద్ధులు, మహిళలు, పెద్దవారు కంటి పరీక్షలు చేయించుకుని , ఇన్నాళ్లకు తమ చూపు స్పష్టంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మురిసిపోయారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనను కలిసిన ఒక వృద్ధుడి అవస్థ నుంచి పుట్టిన కార్యక్రమమే విపిఆర్ నేత్ర అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలపై అవగాహన లేక ఎంతో మంది తమ చూపును నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే గ్రామస్థులకు తాగడానికి నీరు, దివ్యాంగులు ఆత్మ ధైర్యంతో బతికేందుకు ట్రై సైకిల్స్, పేద పిల్లలు చదువుకునేందుకు విపిఆర్ విద్య వంటివి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న తపన నుంచి విపిఆర్ నేత్ర కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జడ్పి ఛైర్మన్ చెంచలబాబు బాబు యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు నాగేంద్ర, స్థానిక నాయకులు చండ్ర మధుసూదన రావు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
