భారీగా తగ్గిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి.
గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు పడిపోతున్నాయి.
అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ. 180గా ఉంది. డిమాండ్ కు మించి కోళ్ల ఉత్పత్తిని పెంచడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.