TEJA NEWS

పలు కేంద్రాలను పరిశీలించి…
జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ..
జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..
మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రైతులు పండించిన వరి ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు సహకరిస్తామని, భరోసా కల్పిస్తామని తెలిపారు.

గత రెండు మూడు రోజుల నుండి పలు జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అకాల వర్షాల వలన రైతులు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రతీ గింజను కొంటామని తెలిపారు. ..
ఎండ ఉన్న సమయంలో ధాన్యం తూకం వేసి సంచుల్లో నింపాలని అన్నారు. …

ధాన్యం తేమ శాతం ఆయన పరిశీలించారు. కల్లాల లో ఉన్న ధాన్యం రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు….
గన్నీ సంచులు, టార్పాలిన్ అవసరం మేరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ..

అనంతరం కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు….
ధాన్యం కొనుగోలు చేసిన రైతుకు డబ్బుల చెల్లింపు విషయం రైతుకు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడారు…

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి వాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్ రావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హతిరాం, తదితరులు, రైతులు పాల్గొన్నారు…


TEJA NEWS