TEJA NEWS

CM Chandrababu media conference in Tirumala

తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం : ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు – ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు – రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రెకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదు – ఎన్నో విజయాలు చూశాం.. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు – వెంకటేశ్వరస్వామి మా ఇంటి కుల దైవం – సీఎం అయిన తర్వాత స్వామిని దర్శించుకున్నా – దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది – శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నా – వెంకటేశ్వరస్వామి నన్ను బ్రతికించారు – తెలుగు జాతికి సేవ చేయాలని స్వామివారు ప్రాణభిక్ష పెట్టారు – రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాను – ప్రపంచంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేది నా తపన – ప్రస్తుతం దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది – సంపద సృష్టించాలి.. అది పేదవాడికి అందాలి – ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలి – ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం – 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది – అంతకుముందు పరిపాలన సచివాలయం నుంచే సాగింది – నేను అధికరంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా – మా పాలన చూసి ప్రపంచ నేతలు హైదరాబాద్‍కు రావడం మొదలుపెట్టారు – మంచి పాలన అందిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ – భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ కుటుంబ వ్యవస్థ – కుటుంబం శక్తి, రక్షణ, ఆనందాన్నిస్తుంది – కష్టాలు పంచుకునే భాగస్వాములు కుటుంబంలోనే ఉంటారు – గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయింది – టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – తిరుమలలో గోవిందా నామ నినాదాలు తప్ప మరేమి వినపడకుండా చేస్తా – ప్రజాపాలన వచ్చింది.. ప్రజలకు రుణపడి ఉంటా – రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా – ఏపీని అభివృద్ధిలో నెం.1 చేస్తా – అమరావతి విధ్వంసమైంది.. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారు – అమరావతి, పోలవరాన్ని చక్కదిద్ది.. పూర్తి చేస్తా – నేను అందరివాడిని.. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా : సీఎం చంద్రబాబు


TEJA NEWS