TEJA NEWS

పెద్దపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,సీఎం రేవంత్ రెడ్డి, వరాల జల్లు కురిపించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం విజయో త్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరయ్యారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. రూ.1000కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యువ వికాస సభను జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు.

అనంతరం 9వేల మంది నిరుద్యోగులకు నియామ కపు పాత్రలు అందించే కార్యక్రమంలో పదిమంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఏడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్య మంత్రి బహిరంగ సభకు జిల్లా నుండి లక్ష మందికి పైగా జనం తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

వెయ్యి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు :
జిల్లా పరిధిలో చేపట్టే రూ.1000 కోట్ల‌ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 82 కోట్ల రూపాయలతో నిర్మించే పెద్దపల్లి బైపాస్ రోడ్డు, సుల్తానాబాద్‌ బైపాస్‌ రోడ్ల నిర్మాణాలకు, జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో స్వశక్తి మహిళా ప్రాంగణం భవన నిర్మాణంతోపాటు..

రామగుండం నియోజక వర్గంలో రూ. 60 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులకు, మంథనిలో ఆర్‌అండ్‌బీ పెండింగ్‌ రోడ్ల పూర్తికి, రూ. 10 కోట్లతో అంతర్గాంలో, మంథని గంగపురిలో, పోతారం గ్రామంలో 33/11 కేవీ సబ్‌ స్టషన్ల నిర్మాణ పనులకు, అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లిలో బండ్లవాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ప్రారంభించారు.

జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, రామగుండం మున్సిపా లిటీల పరిధిలో రూ. 51కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు, ఓదెల మండలం రూపునారాయణపేట వద్ద మానేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రూ. 80 కోట్లతో చేపట్టే పనుల తో పాటు…

కాల్వశ్రీరాంపూర్‌ నుంచి మొట్లపల్లి రూ.25కోట్లతో, పీడబ్ల్యు రోడ్‌ నుంచి ఎల్లంపల్లి వరకు రూ.7 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు, రూ.6 కోట్లతో గర్రెపల్లి నుంచి ఎలిగేడు వరకు రహదారి విస్తరణ, రూ.5 కోట్లతో హుస్సేన్‌ మియా వాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి, రూ. 12 కోట్లతో సుగ్లాంపల్లి నుంచి ధూళికట్ట వరకు రహదారి విస్తరణ పనులకు, రామగుండంలో రూ. 60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మంథనిలో బ్రిడ్జి, రోడ్ల నిర్మాణానికి, మంథని ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభిం చారు. 2.45 కోట్ల రూపాయలతో నిర్మించే గుంజపడుగులో 30 పడకల ఆస్పత్రికి, పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసే పనులను ప్రారంభిం చారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.9 వేల మందికి నియామక పత్రాలు…యువజన వికాస విజయోత్సవ సభలో 9వేల మంది నిరుద్యోగులకు నియామకపు పత్రాలు సీఎం అందించనున్నారు.

500మందికి సింగరేణి ఉద్యోగాల నియామకాలు, గ్రూప్‌- 4, ఇతర ఉద్యోగాలు దాదాపు 8500 మందికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారు.4 పోలీస్ స్టేషన్లు, ఆర్టీసీ డిపో మంజూరు…జిల్లా పర్యట నకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు పోలీస్ స్టేషన్లో తో పాటు పెద్దపల్లికి ఆర్టీసీ డిపో మంజూరు చేశారు.

జిల్లా కేంద్రంగా ఏర్పడిన పెద్దపల్లిలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల తో పాటు నూతనంగా పెద్దపల్లి రూరల్, ఎలిగేడు పోలీస్ స్టేషన్లను మంజూరు చేశామని, జీవో సైతం విడుదల చేశామన్నారు.


TEJA NEWS