బాధితులకు అండగా సీఎం సహాయనిది
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామానికి చెందిన మంతెన లక్ష్మీ ప్రసన్న కి ఎల్.ఓ.సి రూ.8,00,000/-,కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన తాండ్ర సాయి శ్రీరామకృష్ణ కి రూ.2,42,109/-, కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి చెందిన యనుకుల మురళి కృష్ణ రెడ్డి కి రూ.1,75,178/-, బాపట్ల మండలం ఈస్ట్ బాపట్ల కి చెందిన జంపని శివ ప్రసాద్ కి రూ.40,000/-, కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెంకి చెందిన గ్రంథి వెంకటరమణ కి రూ.37,378/-, బాపట్ల పట్టణం వివేకానంద కాలనీకి చెందిన దుడ్డు రమేష్ కి రూ.20,000/- మొత్తం కలిపి రూ.13,14,645/- ల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు,బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.