TEJA NEWS

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.
కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.
హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,నియోజికవర్గ ఇంచార్జీలు.

సిఎస్ఐ గ్రౌండ్ నుంచి
రాందాస్ చౌరస్తా వరకు సీఎం రోడ్ షో

మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెలిక్యాప్టర్ ద్వారా మెదక్ లోని సీఎస్ఐ గ్రౌండ్స్ కు చేరుకున్న సీఎం ని మంత్రులు, నాయకులు రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మెదక్ జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి కి పూల బొకేలు అందించి, ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ప్రచార వాహనంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి రామదాస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.


TEJA NEWS