TEJA NEWS

చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ అదితి సింగ్

తిరుపతి నగరపాలక సంస్థ. :
తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నిర్వహణ చేసేందుకు తూకివాకం వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ పరిశీలించారు. నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రానికి వేర్వేరుగా తరలిస్తారు. నగరం నుండి సేకరించి తడి చెత్త (ప్లాస్టిక్) ద్వారా ఎరువు, పొడి చెత్త ద్వారా వచ్చిన వ్యర్థాలను సిమెంట్ ఫాక్టరీలకు తరలిస్తారని,మార్కెట్, కూరగాయల వ్యర్థాల నుండి గ్యాస్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు కమిషనర్ కి వివరించారు. అలాగే మురుగునీటి నిర్వహణ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. అన్ని ప్లాంట్లు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ ను మరింత శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే మురుగునీటి నిర్వహణ గుంతల వద్ద ఉన్న చెట్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు నగరంలో బైరాగిపట్టెడ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను, త్రాగునీరు, మురుగునీటి కాలువలను పరిశీలించారు. రానున్నది వర్షాకాలం అని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామి రెడ్డి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్స్ చెంచయ్య, సుమతీ, తదితరులు ఉన్నారు.


TEJA NEWS