TEJA NEWS

రాత్రి బస కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పట్నూల్ వీధిలో గల రాత్రి బస కేంద్రం (నైట్ షెల్టర్) ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేంద్రంలో కల్పిస్తున్న మౌళిక వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురిని పలకరించి ఎక్కడ నుండి వచ్చారు, వసతీ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో బస చేస్తున్న వారికి అందించే భోజనాన్ని కమిషనర్ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిషనర్ మాట్లాడుతూ కేంద్రంలో నాణ్యమైన భోజన వసతి, వైద్య సదుపాయాలు బాగా ఉండేలా చూడాలన్నారు. అలాగే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచాలు, బెడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇక్కడ బస చేస్తున్న వారికి ఎటువంటి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, మెప్మా సి.ఎం.ఎం. కృష్ణవేణి, హెూప్ సంస్థ ప్రతినిధి కవిత, తదితరులు ఉన్నారు.


TEJA NEWS