TEJA NEWS

పోర్ట్ రోడ్ లో డంపింగ్ యార్డ్ సందర్శించిన కమిషనర్ సంపత్ కుమార్

డంపింగ్ యార్డ్ ను ఆధునికరణ చేయాలి.. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

పెదగంట్యాడ: గాజువాక పోర్ట్ రోడ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ను త్వరగా తిన ఆధునికరం చేయాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నగర కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యను వార్డు కార్పొరేటర్ గంద శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో శనివారం ఉదయం కమిషనర్ సంపత్ కుమార్ డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. సందర్భంగా వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ రోగాల బారిన పడుతున్నారని కమిషనర్ కు వివరించారు.

గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ డంపింగ్ యార్డ్ సంస్థ ప్రజలు చాలా యాల నుండి ఇబ్బందులు పడుతున్నారని సమస్యను పరిశీలించి తరగతి గతన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ ను క్లోజ్డ్ కంపోస్ట్ గా ఆధునికరం చేయాలని, డంపింగ్ యార్డ్ చుట్టూ గ్రీనరీ ని పెంచి కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్య పునరుద్ధరణ కాకుండా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచనలు పరిశీలన తీసుకొని రోజులు కంపోస్ట్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీను, బోండా జగన్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS