భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే గ్రామాల్లో సదస్సు
మండల కేంద్రమైన పరవాడ లో రీ’సర్వే భు సమస్య పరిష్కార వేదిక గా సంతబయలు వద్ద భూముల రీ సర్వే గ్రామసభ సదస్సు నిర్వహించారు .రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రీ సర్వే గ్రామసభలో ఇటీవలే నిర్వహించిన భూముల సమగ్ర రీసర్వేలో భాగంగా భూముల విస్తీర్ణంలో గాని,హద్దులు గాని,వెబ్ ల్యాండ్ పేర్లు నమోదులో గాని జరిగిన పొరపాట్లను రీ సర్వే గ్రామసభ దృష్టికి తీసుకువచ్చిన రైతులకు వారి భూ సమస్యలకు సత్వర పరిష్కార మార్గాలను చూపడం జరుగుతుందని రెవిన్యూ అధికారులు తెలిపారు.
అధిక సంఖ్యలో రైతులు రీ సర్వే గ్రామసభలో పాల్గొని భూముల రీ సర్వేపై వారి సందేహాలను నివృత్టి చేసుకున్నారు. ఇందులో భాగంగా పరవాడ గ్రామంలో రెవెన్యూ సిబ్బందిచే సదస్సు నిర్వహించి రైతుల నుంచి భూ సర్వేలో జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించిన సవరణలు చేయడానికి 131 దరిఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ సర్వేలో జరిగిన కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించిన వాటిని సవరించడానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.