TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా 132 – జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్, గణేష్ హౌసింగ్ సొసైటీ, శ్రీ కృష్ణా నగర్, మహా నగర్ కాలనీ, రుక్మిణి ఎస్టేట్స్, ప్రశాంత్ నగర్ కాలనీలలో ఎమ్మెల్యే కేపీ. వివేకానందా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మతం పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తుంటే, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ నీచమైన రాజకీయాలు చేస్తున్నాయి తప్పా ప్రజల బాధలను, వారి సంక్షేమాన్ని పట్టించుకోరన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమే అన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు హెలికాప్టర్లలో వచ్చి హాయ్, భాయ్ చెప్పే నాయకులే తప్ప స్థానిక సమస్యలపై వారికి కనీస అవగాహన లేదన్నారు. అదే గత 25 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉండే ప్రజా సంక్షేమం కోసం పనిచేసే రాగిడి లక్ష్మారెడ్డి లాంటి నాయకుడిని గెలిపిస్తే ప్రజా సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పట్టింపు వేగంతో జరుగుతుందన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ప్రజలంతా బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

గణేష్ నగర్ : యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, రవి, వేణు చారి, అనంతరామిరెడ్డి, ప్రతాపరెడ్డి, రాములు….

ప్రశాంత్ నగర్ : ప్రతాపరెడ్డి, నాగభూషణం, శ్రీను, దుర్గాప్రసాద్, నరసింహ, రాజేష్, నాగరాజు, కృష్ణ, శివ, సంతోష్…

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, జీడిమెట్ల డివిజన్ బిఆర్ఎస్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్, నదీమ్ రాయ్, ఎల్లా గౌడ్, వేణు, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కుంటి మల్లేష్, రుక్మిణి, యాదగిరి, నార్ల కంటి కుమార్, ప్రతాపరెడ్డి, ఆటో బలరాం, యేసు, కుంట వేణు, నార్ల కంటి శ్యామ్ మహిళా నాయకురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS