సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
** చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం
చంద్రగిరి: నియోజకవర్గ ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని… వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్ లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి…ఎదుర్కొంటున్న సమస్యలను విన్న ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు వివరాలు తెలిపి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
