TEJA NEWS

అఖిల భారత మహిళా కాంగ్రెస్ (AIMC) సభ్యత్వాన్ని నమోదు చేయించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

అఖిల భారత మహిళా కాంగ్రెస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లతో సమావేశం ఏర్పాటుచేసి, మహిళలతో అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ (AIMC) ఆన్‌లైన్ సభ్యత్వాన్ని నమోదు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ (INC) యొక్క మహిళా విభాగం అయిన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ (AIMC) ఆన్‌లైన్ సభ్యత్వాన్ని ప్రతి మహిళా పొందాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు ప్రత్యేక సభ్యత్వ డ్రైవ్ లు నిర్వహించి డివిజన్ లోని మహిళలతో సభ్యత్వం నమోదు చేయించి, మహిళల రాజకీయ మరియు సామాజిక సాధికారతను ప్రోత్సహించడానికి స్థాపించిన మహిళా విభాగానికి సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి దుర్గారాణి, రాజ్యలక్ష్మి, మధులత, అరుణ, సౌందర్య, షేక్ బీబీ, స్వరూప, పుట్టం దేవి, పద్మ, కృష్ణవేణి, శ్యామల, వల్లి రమణ, శ్రీలత, లక్ష్మీ, నాగలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS