ముందస్తూ చర్యలతో వరంగల్ కమిషనరేట్‌లో నేరాల అదుపు
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తూ చర్యలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు అదుపులో వుండటంతో పాటు తగ్గు ముఖం పట్టినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో తెలియజేసారు. పోలీస్ కమికషనర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2024 సంబంధించి క్రైమ్ రౌండప్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. వరంగల్ కమిషనరేట్ పోలీసులు ముందస్తూ ప్రణాళికలు, సమాచారంతో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని. ముఖ్యంగా పోలీసులు నేరాలను కట్టడి చేయడంతో పాటు, నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ గత ఏడాదితో పాటు ప్రస్తుత ఏడాది జరిగిన నేరాలకు వ్యత్యసాలను పోలీస్ కమిషనర్ మీడియా ప్రతినిధులకు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తు త సంవత్సరం 14,406 కేసులు నమోదు కాగా గత ఏడాది కన్న 3.21 శాతం కేసులు తక్కువగా నమోదు కాబడ్డాయని. అదే విధంగా గత సంవత్సరణ గణాంకాల అధారంగా చేసుకోని ప్రస్తుత సంవత్సరంలో హత్య లు 16.67 శాతం తగ్గాయని, అలాగే ఆస్తినేరాలకు సంబంధించి స్వల్పంగా 2.23 శాతం తగ్గడంతో పాటు 11 కోట్ల81 లక్షల రూపాయల విలువ గల చోరీ సోత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివిధ రాష్ట్రాలకు చెందిన 18 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేయడం జరిగిందని. మహిళలపై నేరాలకు సంబంధించి 11 శాతం, మోసాలు 16 శాతం, అపరహణ 7.45 శాతం చోప్పున గత సంవత్సరం కన్నా తక్కువ కేసులు నమోదయినాయి. అలాగే పోలీసులు తీసుకున్న ప్రత్యేక చోరవ వలన ఏడాది రొడ్డు ప్రమాదాలను నివారించడంలో కమిషనరేట్ పోలీసులు విజయం సాధించారు. ఇందులో గతే ఏడాది 1558 రోడ్డు ప్రమాదాలు జరగగా, ప్రస్తుత సంవత్సరంలో 1434 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయినాయని, అలాగే ఈ రోడ్డు ప్రమాదాల్లో గత సంవత్సరం 499 మంది మరణించగా, ఈ ఏడాది 417 మంది మరణించారు. గత సంవత్సరం కన్నా 12.30 శాతం తక్కువగా రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు తగ్గించబడ్డాయని. సైబర్ నేరాలకు సంబంధించి 772 కేసులు నమోదు కావడంతో పాటు సైబర్ నేరాగాళ్ళ నుండి సుమారు ఒక కోటి 30 లక్షల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోబడిరదని. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న చర్యల్లో భాగంగా 147 కేసుల్లో సుమారు 2కోట్ల 63లక్షల రూపాయల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 321మంది నేరస్తులు అరెస్టు కాబడ్డారు. నేరాలకు సంబంధించి పోలీసులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయడంతో పాటు తగిన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడంతో 2462 మందిపై నేరాలు నిరూపణ కావడంతో శిక్షలు విధించబడ్డాయి. ఇది గతే ఏడాది కంటే 42 శాతం ఎక్కువగా నమోదయిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్, ఎ.ఎస్పీ మనాన్ భత్, అదనపు డిసిపి రవి, ఎసిపిలు జితేందర్ రెడ్డి, డేవిడ్‌రాజు, ఇన్స్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్ పాల్గోన్నారు.