TEJA NEWS

మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాలలో కమలదళం విజయ డంకా మోగించింది

మండలనేని చరణ్ తేజ, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమలదళం విజయ డంకా మోగించడంతో, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గెలిచిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కి అభినందనలు తెలియజేస్తున్నారని, బిజెపి అగ్ర నాయకుల వ్యూహం పాలించటంతో రాష్ట్రబిజెపి నాయకులతో పాటు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారని మండలనేని చరణ్ తేజ ఓ పత్రిక ప్రకటనలో శనివారం తెలియజేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్టాలలో కూడా జనసైనాని ఎన్డీఏ అభ్యర్థుల విజయంలో పాలుపంచుకోవడంతో, జనసేన అధినేతను బిజెపి తోపాటు ఎన్డీఏ కూటమి ఎక్కడ ఏ విధంగా ప్రతిభ పాటవాలను వినియోగించుకోవాలో ఒక అవగాహన కలిగి ఉందని మండలనేని తేజ అన్నారు.


TEJA NEWS