క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,26 వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు .
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగ శ్రవణం పఠనం చేసి ఈ ఏడాదిని గురించి,అదే విధంగా రాశి ఫలాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆవుల వెంకటేశ్వరరావు,సురేష్, ఆది ప్రసాద్, సత్యనారాయణ, గద్దె శ్రీను, శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్, శ్రీనివాస్ నగర్ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.