TEJA NEWS

హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి..

ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుంది..

హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి..
తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత..

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో మాట్లాడారు. హైదరాబాద్ ను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేయటంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు.


TEJA NEWS