వేతనాలనుచెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఎదుట ధర్నా
వనపర్తి : బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతినిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి మురికి పనులు చేస్తున్న మున్సిపాలిటీ కార్మికులకు జులై వేతనాలను ఆగస్టు సగం నెల వచ్చిన జీతాలు చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే వేతనాలను చెల్లించాలని తిండి పెట్టండి పని చెప్పండి అన్ననినాదాలను చేశారు అలాగే ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ తో నాయకులు జరపడంతో వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే ఆగస్టు 15 నిరసన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) జిల్లా అధ్యక్షులుఎం చంద్రయ్య ఉపాధ్యక్షులు యాదగిరి పట్టణ గౌరవ అధ్యక్షులు గడ్డం కురుమయ్య పట్టణ అధ్యక్షులు మౌలాలి. ప్రధాన కార్యదర్శి పి గోపాల్ పట్టణ నాయకులు కే మన్యం సుమన్ జి బాలస్వామి భగవంతు జి రవి బాలు శేఖర్ జయమ్మ చిట్టెమ్మ సుశీలమ్మజయలక్ష్మి రేణుక తదితరులు పాల్గొన్నారు.
వేతనాలనుచెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఎదుట ధర్నా
Related Posts
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్
TEJA NEWS మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే…
కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్
TEJA NEWS కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ వనపర్తి :వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ…