మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
వనపర్తి
మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది . ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ చైర్మన్ పి .మహేష్ కు రాష్ట్ర వ్యాప్త డిమాండ్లు 12 వాటితో కూడిన ఒక వినతిపత్రం, వనపర్తి మున్సిపల్ స్థానిక కార్మికుల సమస్యలు ఒక వినతిపత్రం వేరువేరుగా అందజేయడం జరిగింది .వనపర్తి మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆయనపాల్గొని మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26,000 అమలు చేయాలని ,కేటగిరి వారిగా వేతనాలు చెల్లించాలని ,ప్రతి నెల 5వ తేదీ లోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వనపర్తి లో ఈ ఎస్ ఐ దవాఖానా వెంటనే ప్రారంభించాలని ,60 సంవత్సరాలు దాటిన వారి పిల్లల పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలని ,వాహనాలన్నిటికీ ఇన్సూరెన్స్ కట్టాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే మున్సిపాలిటీ అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, చైర్మన్ లు మాట్లాడుతూ వెంటనే వాహనాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ,బట్టలు చెప్పులు నూనెలు పనిముట్లు వెంటనే చెల్లిస్తామని, 60 ఏళ్లు దాటిన వారి పేర్లు వారి పిల్లలను పేర్లను వెంటనే నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. చంద్రయ్య, సానిటరీ వర్కర్స్ పట్టణ గౌరవాధ్యక్షులు గడ్డం కురుమయ్య, సానిటరీ అధ్యక్షులు లాల్, కార్యదర్శి గోపాల్ ,వాటర్ వర్కర్స్ అధ్యక్షులు నరేష్ గౌడ్, కార్యదర్శి శాంతయ్య , సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, నాయకులు బాలు, వెంకటమ్మ, శాంతమ్మ, సురేందర్, మూర్తి ,రాములు, సుజాత, గోపాలమ్మ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు