TEJA NEWS

ఇనుగుర్తి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ – ‘ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం’ అంటూ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ ..

మహబూబాబాద్ నియోజకవర్గం ఇనుగుర్తి మండల కేంద్రంలో చెట్ల ముప్పారంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల, పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మంజూరైన ఇంటికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే , లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ఇళ్ల లేని పేదలకు గృహ నిర్మాణం కల నెరవేర్చే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఎంతో గొప్పది. ఈ పథకం ద్వారా వేలాది మంది ఆశ్రయహీనులు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. ప్రతి లబ్దిదారుడు తన ఇంటిని సురక్షితంగా, భవిష్యత్తును బలపరిచే విధంగా నిర్మించుకోవాలి అని సూచించారు..

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలకడమేకాక, ఆమెతో గ్రామస్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు..