TEJA NEWS

ఘనంగా పినాక ఉచిత శిక్షణ తరగతుల ముగింపు వేడుక

కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు

కర్నూలు:రాయలసీమలోని 10కేంద్రాలలో ప్రతి సంవత్సరం ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి మరియు కర్నూలు జిల్లాలో అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ చాపే ఆధ్వర్యంలో 21రోజులపాటు పూర్తి ఉచితంగా పినాక ఉచిత శిక్షణ తరగతులు గత ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా నడుపబడుతున్నాయి అందులో భాగంగా కర్నూలు పినాక సెంటర్(శ్రీలక్ష్మీ హైస్కూల్)లో 21రోజులు పూర్తిచేసుకుని సాయంత్రం ముగింపు వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది పినాక కోర్స్ డైరెక్టర్,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంటు సభ్యులు .బస్తిపాటి నాగరాజు , కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ అనేక ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కవోని దీక్షతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో కర్నూలు ఎంపీ స్ధానానికి ప్రయత్నించి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎంపీ టికెట్ పొందడమేగాక అఖండ విజయం సాధించామని దీనంతటికీ ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణ కారణాలని వాటిని పినాకలో విద్యార్థులకు శిక్షణ ఉచితంగా ఇవ్వడమేగాక భోజనం,వసతి సదుపాయాలు కల్పించిన ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి ,డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆదర్శనీయులని అన్నారు పినాకలో శిక్షణ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయిలలో ఉండాలని ఆకాంక్షించారు.


కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కృషిచేస్తే తప్పకుండా విజేతలవుతారని తమలాంటి పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదన్న ఉద్దేశంతో పదిమందికి విద్యను, జ్ఞానాన్ని పంచుతున్న ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి ,డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గొప్ప వ్యక్తులన్నారు.అనంతరం పినాక బృందం ఎంపీ బస్తిపాటి నాగరాజు ని, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు ని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ హైస్కూల్ డైరెక్టర్ పీ.దీక్షిత్, ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్వకేట్ బలరాం,కురువ సంఘం ప్రధాన కార్యదర్శి రంగస్వామి,కె.రామకృష్ణ,గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య,మదాసిమదారి కురువ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,మదాసి మదారి కురువ సంఘం రాష్ట్ర నాయకులు,గొర్రెల సొసైటి డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి,పినాక అధ్యాపకులు సునితా రోజ్, జాయిస్, స్వర్ణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.