TEJA NEWS

లక్ష రూపాయలు చెల్లిస్తేనే ఇందిరమ్మ ఇండ్లు

లక్ష రూపాయలు ఎవరు ఇస్తే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తున్న కాంగ్రెస్ నాయకులు

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారు అనిత అనే మహిళ తన భర్తతో ఇద్దరూ కూలి పని చేసుకుంటూ నలుగురు పిల్లల్ని పోషిస్తున్నారు

ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.1 లక్ష ఇస్తేనే ఇల్లు మంజూరు అవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారని వాపోతున్న మహిళ

దీంతో చేసేదేమీ లేక రూ.50 వేలు అప్పు చేసి మరీ చెల్లించానని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ

ఇల్లు కట్టుకునే స్థోమత లేకనే ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు