District Congress Party Office Hanmakonda
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హన్మకొండ
మీడియా సమావేశం
హన్మకొండ లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , నగర మేయర్ గుండు సుధారాణి , వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య కామెంట్స్….
వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, నా గెలుపు కోసం కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా పై నమ్మకంతో నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు.వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటిని నేరవెర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చెస్తాను.
ముఖ్యంగా వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ అమలు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ భూపాలపల్లి నేషనల్ హైవే ను ఇండస్ట్రీయల్ కారిడర్ గా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తాను
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి రెండు పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన వరంగల్ జిల్లా ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారు. వరంగల్ జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ అన్ని మతాలకు మద్దత్తు ఇస్తూ సమ ప్రాధాన్యం కల్పించడం గొప్ప విషయం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కళంగా ఉన్నాయి. బొగ్గు గనులు, సారవంతమైన నెలలు, అటవీ సంపద, గోదావరి నది వంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడుతాను.
వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా మంత్రులు ఎమ్మెల్యే లు అందరితో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తాము.మతత్వ విధానాలు ఆవలంబిస్తున్న బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో తక్కువ సీట్లు వచ్చాయి. లౌకిక వాదానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయి అంటే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచారనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.
జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.నన్ను ఆదరించి ఆశీర్వదించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తానని హామీ ఇస్తున్నాను.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్
భారత దేశానికి అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం మాత్రమే శ్రీరామ రక్షప్రజలు చాలా గొప్ప వారు, ప్రజా స్వామ్యం ప్రజల చేతుల్లో భద్రంగా ఉంది.
ఎవరెన్ని ఆరోపణలు చేసిన, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన ప్రజలు నమ్మలేదు
కాంగ్రెస్ పార్టీ పనితీరు చూసి ఓటు వేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగిందిబిఆర్ఎస్ ఓట్లు బీజేపీ మారాయి కాబట్టే బీజేపీ కి 8సీట్లు వచ్చాయి
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు నమ్మకంగా ఉన్నారుబీజేపీ 300సీట్ల నుండి 250కి పడిపోయింది
దేశంలో మోడీ ప్రభ తగ్గిపోయిందిరాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే
బీజేపీ పార్టీ గాని, మోడీ ప్రభుత్వం గాని రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.