చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారు.
చందుర్తి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని,స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటు పై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు.
విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు చట్టాల మీద, డయల్100,షీ టీమ్స్, సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు.
ఎస్పీ గారి వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.