మోతె పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సూర్యాపేట జిల్లా మోతే మండల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ కి డిఎస్పి శ్రీధర్ రెడ్డి, సిఐ రామకృష్ణరెడ్డి, స్వాగతం పలికారు, గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సిబ్బంది యొక్క పోలీస్ పరేడ్ ను, సిబ్బంది టర్న్ ఔట్ ను, పోలీస్ సిబ్బంది కిట్టు ను పరిశీలించారు. కేసుల్లో ఉన్న వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ అవరణంలో మొక్కలు నాటారు.
పోలీస్ స్టేషన్ డైరీ, రిషప్షెన్ రిజిష్టర్ ని తనిఖీ చేసి మండల పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు, పిర్యాదుల తీరుతెన్నులు, కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు. నాణ్యమైన వేగవంతమైన దర్యాప్తు చేయాలని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ షీట్స్, రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, పెండింగ్ కేసు ఫైల్స్, కోర్టు డ్యూటీ విధులను, రిసెప్షన్ విధులు, బ్లూ కొట్ విధులు, పెట్రో కార్ విధులు, కేసుల అంతర్జాల నమోదు,సి సి టి ఎన్ యస్ సిస్టం, సి సి కెమెరాల పని తీరు, సెక్షన్ విధులు, ఎస్ హెచ్ ఓ ,విధులు, పోలీసు పని విభాగాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలు పౌరులకు వేగంగా అందించాలి. ఫిర్యాదులపై వేగంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని కేసులు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపినారు, ఒక టీం గా పనిచేస్తూ లక్ష్యంతో ముందుకెళ్తే అనుకున్న విజయాలను సాధించవచ్చు అని ఎస్పీ కోరినారు.
గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా సామాజిక రుగ్మతలు, అసాంఘిక చర్యలు లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు బెట్టింగులు, జూదం లాంటివి లేకుండా చూడాలని కోరినారు. సమస్యాత్మక ప్రాంతాలను తరచు సందర్శిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నేర నివారణలో ముందుకు సాగాలని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని అలాగే రోడ్డు భద్రతా చర్యలను తీసుకుంటూ రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ సబ్ డివిజనల్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, మోతే పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాదవెందర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.