TEJA NEWS

అనకాపల్లి జిల్లా పోలీసు

జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం)
కార్యక్రమానికి 47 ఫిర్యాదులు

ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన: జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్.,

అనకాపల్లి, జిల్లా పోలీసు కార్యలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన 47 ఫిర్యాదులలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు మరియు చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. ప్రతీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ మరియు అదనపు ఎస్పీ
నేరుగా ఫిర్యదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్, ఎస్సై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, అనకాపల్లి.


TEJA NEWS