పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.*

పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.*

TEJA NEWS

Perform sanitation tasks better.

పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టండి.*
వాకర్స్ కూర్చునేందుకు బెంచులు ఏర్పాటు చేయండి.*
కమిషనర్ అదితి సింగ్*


నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని, గొల్లవాణిగుంట వాకింగ్ ట్రాక్ పక్కన కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆరోగ్య, పారిశుద్ధ్య విభాగపు సిబ్బందిని ఆదేశించారు. తెల్లవారజామున నుండి నగరంలో లీలా మహల్ కూడలి, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, బాలాజీ కాలనీ, బేరి వీధి, కర్నాల వీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఆటోనగర్ సమీపంలోని గొల్లవాని గుంట బండ్ అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అలాగే మురుగునీటి కాలువల్లో చెత్త చెదారం నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు.

రోజు వాహనాలు ఇంటికి వెళుతున్నా కొంతమంది గోతాల్లో చెత్త వేసి వీధుల్లో వేస్తున్నారని సిబ్బంది తెలిపారు. రోడ్లపైనే, కాలువల్లో చెత్త వేసే వారిని గుర్తించి అపరాధ రుసుము విధించాలని అన్నారు. మార్కెట్లో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉందని, ప్రతి రోజూ బాగా శుభ్రం చేయాలని అన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అన్నారు. ఇంజినీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది ఒక అవగాహనతో పనిచేసి ఎక్కడా కాలువల్లో చెత్త నిలవకుండా శుభ్రం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ , శానిటరీ సూపర్ వైజర్స్ చెంచయ్య, సుమతీ, మేస్త్రీలు తదితరులు ఉన్నారు. అనంతరం ఆటోనగర్ సమీపంలోని గొల్లవానిగుంటలో ఉన్న స్టేడియం, బండ్ అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. స్టేడియం లో ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బండ్ పైన ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, పౌంటెన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. నడక కోసం వచ్చే వారు కొంతసేపు కూర్చునేందుకు వీలుగా అక్కడక్కడా బెంచీలు ఏర్పాటు ఏర్పాటు చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, అనిల్, కాంట్రాక్టర్ సంతోష్ తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS