TEJA NEWS

ఏడు కొండ‌ల వాడితో పెట్టుకోవ‌ద్దు… జ‌గ‌న్ కు లోకేష్ వార్నింగ్.

ఫేకు వార్త‌ల జ‌గ‌న్ అంటూ వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌పై విమ‌ర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జ‌గ‌న్ ను తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. నువ్వు మార‌వు… నీ ఫేకు మూక‌లు మార‌వు… ఫేక్ జ‌గ‌న్, ఫేక్ చేసి చేసీ 151 స్థానాల నుండి 11కు ప‌డిపోయావు. మంత్రి సంధ్యారాణి ఇంట్లో త‌న మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల‌ను తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ట్లు ఫేక్ ప్ర‌చారం చేస్తావు. శ్రీ‌వారితో పెట్టుకోవ‌ద్దు. ఏడు కొండ‌ల‌పై నీ విష రాజ‌కీయాలు వాడొద్దు.

ఇదే తీరు కొన‌సాగితే నీకు ఒక్క సీటు కూడా రాకుండా పోతావ్ అంటూ లోకేష్ హిత‌వు ప‌లికారు. మంత్రి సంధ్యారాణి త‌న బంధువుల‌తో పాటు కొంద‌రు మీడియా వారిని తీసుకొని తిరుమ‌ల వెళ్లార‌ని, అక్క‌డ ఓ అతిధి గృహంలో ఇలా డ్యాన్సులు చేస్తున్నారంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసింది. తిరుమ‌ల పవిత్ర‌త‌ను కాపాడుతాం అని చెప్పే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అంటూ విమ‌ర్శించింది. అయితే, అది త‌ప్పుడు వీడియో అని… ఇంట్లో మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల వీడియోల‌ను, తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని మంత్రి వివ‌రించారు.


TEJA NEWS