మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే

TEJA NEWS

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్

 సాక్షిత వనపర్తి జూన్ 7             మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లపై ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని  స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు

జిల్లాలో ఎన్ని కుటుంబాలకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోతాదులో వస్తున్నాయి, ఇంకా నల్ల కనెక్షన్లు రాని కుటుంబాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయాల్సిందిగా ఆదేశించింది. ఇదే కార్యక్రమము పై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మిషన్‌ భగీరథ మొబైల్‌ అప్లికేషన్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మొబైల్‌ అప్లికేషన్‌ చేసే విధానం గురించి వివరించారు. ఈ మొబైల్‌ అప్లికేషన్‌ సర్వే కోసం జిల్లాలోని ఆయా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే పక్కాగా చేయాలన్నారు. సర్వేలో ప్రతి గ్రామం లేదా మున్సిపాలిటీ లో ఎన్ని ఇళ్లకు మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్లకు లేవు, ఉన్న కనెక్షన్లలో ఎన్ని పనిచేస్తున్నాయి అనే సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలని, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఇంట్లో సభ్యుల వివరాలను ఎంట్రీ చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లు, మేజర్‌ పంచాయతీల్లో ఎంపీడీవో, ఎంపీవోలు మానిటరింగ్‌ చేయాలన్నారు.

సమావేశంలో మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ మేఘా రెడ్డి, ఇంచార్జి డిఆర్డిఓ నాగేంద్ర, జిల్లా పంచాయతీ అధికారి రమణ మూర్తి, ఎంపీడిఓ లు, ఎంపీవోలు, ఎఫ్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, సీసీ లు, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS