ఐఎంఏ స్టేట్ బెస్ట్ సెక్రెటరీగా డాక్టర్ బూసిరెడ్డి …
గుంటూరు బ్రాంచ్ కు మూడు పతకాలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అవార్డు అందుకున్నారు.
2023-2024 సంవత్సరానికి గాను గుంటూరు బ్రాంచ్ ను అన్ని విభాగాలలో ఉత్తమ పనితీరు కనపరిచేలా తీర్చిదిద్దినందుకు గాను డాక్టర్ బూసిరెడ్డికి ఈ అవార్డు దక్కింది.
శుక్రవారం రాత్రి గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ రాష్ట్ర స్థాయి అవార్డు ల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆర్ వి అశోకన్, డాక్టర్ అనిల్ కుమార్ జే నాయక్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ కార్యదర్శితో పాటు గుంటూరు బ్రాంచ్ కు ఉత్తమ సేవా విభాగం, విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం( ఫ్లడ్ రిలీఫ్ ) అందించినందుకు గాను రెండు పతకాలు లభించాయి …